Shimla | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా (Shimla)లో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిపోయింది (5 Storey House Collapses). అయితే, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో అందులోని నివాసితులను ముందుగానే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. భవనం పేకమేడలా కుప్పకూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
शिमला में लगातार और मूसलाधार बारिश ने अपना ख़ौफ़नाक रूप दिखाना शुरू कर दिया है. शहर के के भट्टकूफ़र इलाके में एक बहुमंज़िला इमारत बरसात की मार के आगे नहीं टिक सकी. #shimla #Bhattakufar #incessantrain pic.twitter.com/7A1Uww1sGr
— Rana Yashwant (@RanaYashwant1) June 30, 2025
హిమాచల్‌కు రెడ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని 10 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) వరద హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘కులు, ఉనా, చంబా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది. రాబోయే 3 నుండి 4 గంటల్లో కిన్నౌర్, లాహుల్, స్పితి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయని, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ సిమ్లా కేంద్రంలోని సీనియర్ అధికారి సందీప్ కుమార్ శర్మ తెలిపారు.
Also Read..
Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. హిమాచల్‌కు రెడ్ అలర్ట్
Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్