Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మూడు విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఉత్తరప్రదేశ్ ఆగ్రా (Agra), కర్ణాటకలోని హుబ్బళ్లి (Hubballi), మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ (Jabalpur) ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఈమెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపులపై ఆయా ఎయిర్‌పోర్ట్స్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్ ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. అవి బూటకపు బెదిరింపులుగా అధికారులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఐడీ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Shimla | భారీ వర్షాలు.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్