న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జపాన్‌లోని నీల్గాత యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు హిమాలయాల్లో పురాతన సముద్ర అవశేషాలను కనుగొన్నారు. పరిశోధన ఫలితాలను ప్రీకేంబ్రయిన్ రిసెర్చ్‌లో ప్రచురించారు.
600 మిలియన్ ఏండ్ల క్రితం నాటి ఖనిజ నిక్షేపాలలో చిక్కుకున్న సూక్ష్మ నీటి బిందువులను వారు కనుగొన్నారు. 700 నుంచి 500 మిలియన్ ఏండ్ల క్రితం భూమి స్నోబాల్ ఎర్త్ గ్లాసియేషన్ అని పిలిచే సుదీర్ఘ హిమానీ నదానికి గురైందని తెలిపారు.