Anand Mahindra | రాఖీ వేళ.. చెల్లికి క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్ర
Anand Mahindra | రాఖీ పండుగ వేళ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియా ద్వారా తన చెల్లికి క్షమాపణలు (Apologies) చెప్పారు.
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఇక ఏ రంగంలో వారినైనా ప్రోత్సహించడంలో మహీంద్ర ముందుంటారు. ఈ క్రమంలోనే ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. కాగా, రాఖీ పండుగ వేళ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా ద్వారా తన చెల్లికి క్షమాపణలు (Apologies) చెప్పారు.
రక్షాబంధన్ (Rakshabandhan) సందర్భంగా మహీంద్ర ట్విట్టర్లో ఓ ఫొటో షేర్ చేస్తూ.. ‘కొన్ని సంవత్సరాల క్రితం రాఖీ సందర్భంగా నా సోదరి రాధిక, నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశాను. అయితే, ఎవరో దాన్ని కలర్ ఫొటోగా మార్చారు. ఇప్పుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోను మళ్లీ పోస్ట్ చేస్తున్నాను’ అని రాసుకొచ్చారు. అయితే పోస్ట్ చివర్లో తన చెల్లి అనూజ (Anuja)కు క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆ ఫొటో తీసిన సమయంలో ఆమె ఇంకా పుట్టలేదని తెలిపారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ
— anand mahindra (@anandmahindra) August 30, 2023
Also Read..
Fire Accident | భారీ అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం
Urvashi Rautela | ఊర్వశి రౌతేలాకు నిమిషానికి కోటి పారితోషికమట.. అబద్దమాడినా అతికినట్లుండాలి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

