CSK vs PBKS : సొంతగడ్డపై గత మ్యాచ్‌లో రెండొందలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) ఈసారి తడబడింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాటర్లు కాడి ఎత్తేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) ఒంటరి పోరాటం చేశాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో వికెట్ల 7 నష్టానికి 162 రన్స్ చేసింది. స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్ చెలరేగినా అదరని గైక్వాడ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి.. అర్ధ సెంచరీతో మెరిశాడు. అజింక్యా రహానే(29), ఇంప్యాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(21) సైతం ఓ చేయి వేయడంతో చెన్నై పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన చెన్నైకి ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలుత ఆచితూచి ఆడిన రుతురాజ్ గైక్వాడ్(62), అజింక్యా రహానే(25)లు ఆతర్వాత ఒక్కసారిగా వేగం పెంచారు. బౌండరీల మోతతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, పవర్ ప్లేలో సీఎస్కే వికెట్ కోల్పోకుండా 55 రన్స్ కొట్టింది. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే చెన్నై మరోసారి రెండొంలు కొట్టడం ఖాయమనిపించింది.
Openers beginning to cut loose 👍
No damage for #CSK as they end the 7th over at 60/0👌
Follow the Match ▶️ https://t.co/EOUzgkM7XA #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Is0QidMMsr
— IndianPremierLeague (@IPL) May 1, 2024
పవర్ ప్లేలో పటిష్ట స్థితిలో నిలిచిన చెన్నైని హర్‌ప్రీత్ బ్రర్ రెండు వికెట్లతో దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు అజింక్యా రహానే(29), శివం దూబే(0)లను ఔట్ చేసి పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(2)ను రాహుల్ చాహర్ ఎల్బీగా వెనక్కి పంపి సీఎస్కేను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 70 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును సమీర్ రిజ్వీ(21)తో కలిసి ఒడ్డున పడేసే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్‌కు 37 రన్స్ చేసిన ఈ జోడీని రబడ విడదీశాడు. థర్డ్ మ్యాన్‌లో హర్షల్ పటేల్ జారుతూ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో రిజ్వీ వెనుదిరిగాడు.
Recap Harpreet Brar’s 2 wickets in the same over 🙌
He finishes his spell with these wickets for just 17 runs 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/iya1OG2qED
— IndianPremierLeague (@IPL) May 1, 2024
రిజ్వీ తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ(15) జతగా గైక్వాడ్ దంచాడు. సామ్ కరన్ ఓవర్లో తొలి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ సాధించాడు. అలీ సైతం సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే.. 18వ ఓవర్లో అర్ష్‌దీప్ సూపర్ యార్కర్‌తో గైక్వాడ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆ వెంటనే ఎంటరైన ఎంఎస్ ధోనీ(14).. 20వ ఓవర్లో ఒక ఫోర్, సిక్సర్ బాది స్కోర్ 160 దాటించాడు. దాంతో, గైక్వాడ్ సేన పంజాబ్‌కు ఓ మోస్తరు టార్గెట్ ఇవ్వగలిగింది.
Maximum 💪 💥
Consecutive fifties for captain Ruturaj Gaikwad and he now leads the Orange Cap race 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/RLw1nk5Qug
— IndianPremierLeague (@IPL) May 1, 2024