Loksabha Elections 2024 : ఓటమి నైరాశ్యంతోనే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తన మాటలను వక్రీకరిస్తూ డీప్‌ఫేక్, మార్ఫ్డ్ వీడియోలు వైరల్ చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కర్నాటకలోని హవేరిలో జరిగిన రోడ్‌షో సందర్భంగా ఓ వార్తాసంస్ధతో ఆయన మాట్లాడారు. కర్నాటకను కుదిపేసిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల గురించి ప్రశ్నించగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, శాంతిభద్రతల అంశం వారి బాధ్యతని స్పష్టం చేశారు.
కొద్ది నెలల కిందటే పాలకులకు ఈ విషయం తెలుసని, వక్కలిగ ప్రాబల్య ప్రాంతాల్లో ఓటింగ్ ముగిసే వరకూ నిందితుడిని పట్టుకోలేదని ఆరోపించారు. ఆయనకు పారిపోయే వెసులుబాటు కల్పించారని అన్నారు. కర్నాటక సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం ఇందుకు బాధ్యత వహించాలని అమిత్ షా స్పష్టం చేశారు.
Read More :
MLA Jagadish Reddy | కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉంది