Earthquake | కిష్త్వార్ను వణికించిన స్వల్ప భూకంపం.. 24 గంటల వ్యవధిలో రెండోసారి
Earthquake | జమ్మూ కశ్మీర్లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్త్వార్ (Kishtwar)లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Earthquake | జమ్మూ కశ్మీర్లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్త్వార్ (Kishtwar)లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
కాగా, 24 గంటల వ్యవధిలో ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదైంది. అయితే, అదృష్టవశాత్తూ భూకంపం తీవ్రత స్వల్ప వ్యవధిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, వరుసగా భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
An earthquake of magnitude 3.8 on the Richter Scale hit Kishtwar, Jammu and Kashmir at 02.53 pm today: National Center for Seismology pic.twitter.com/WN9NvRVcjJ
— ANI (@ANI) April 6, 2024
Also Read..
Soldiers | కారును ఢీ కొట్టిన జవాన్లతో వెళ్తున్న బస్సు.. ముగ్గురు మృతి
KTR | చిన్నారులతో కలిసి షటిల్ ఆడిన కేటీఆర్.. VIDEO
Lakshadweep | మోదీ పర్యటనతో లక్షద్వీప్కు పర్యాటకులు పెరిగారు : టూరిజం అధికారి ఇంతియాజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

