Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో గల ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వెంటనే తనిఖీలు చేపట్టిన అధికారులు అది బూటకపు బెదిరింపులుగా తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి కలెక్టరేట్ (Trichy Collectorate), తిరుచ్చి కార్పొరేషన్ కార్యాలయాన్ని (Trichy Corporation Office) లక్ష్యంగా చేసుకొని బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులను బయటకు పంపి.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో రెండు చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది అంతా బూటకపు బెదిరింపులు అని నిర్ధరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఐడీ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Tamil Nadu: An anonymous bomb threat email targeting Trichy Collectorate and Trichy Corporation Office was received today. Bomb Detection and Disposal Squad (BDDS) conducted a thorough search of both premises. No explosives were found, and the threat was later determined… pic.twitter.com/MKAcIsTByU
— ANI (@ANI) July 2, 2025
Also Read..
Infosys Techie | ఆఫీస్ వాష్‌రూమ్‌లో రహస్యంగా మహిళల వీడియోలు రికార్డ్.. ఏపీకి చెందిన టెకీ అరెస్ట్
GST Relief | మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ రిలీఫ్.. ఆ వస్తువులపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం..?
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి