Infosys Techie | ఆఫీస్ వాష్‌రూమ్‌లో రహస్యంగా మహిళల వీడియోలు రికార్డ్ (Secretly Filming Woman In Washroom) చేస్తున్న ఓ టెకీని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు టెకీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన బెంగళూరు (Bengaluru)లోని ప్రముఖ ఐటీ కంపెనీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో (Infosys Techie) ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన 28 ఏళ్ల నగేష్ స్వప్నిల్ మాలి (Nagesh Swapnil Mali) ఇన్ఫోసిస్ కార్యాలయంలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. అయితే, అతడు ఎవరికీ తెలీకుండా ఆఫీస్ రెస్ట్రూమ్లోని మహిళా ఉద్యోగుల వీడియోలను చిత్రీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ నెల 30న ఓ మహిళా ఉద్యోగి రెస్ట్రూమ్లో ఏదో అసాధారణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించింది.
దీంతో ఆమె అక్కడ నిశితంగా పరిశీలించగా.. ఓ వ్యక్తి మొబైల్ ఫోన్లో రహస్యంగా వీడియో చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. గట్టిగా కేకలు వేయడంతో.. సహోద్యోగులు అక్కడికి చేరుకుని నగేష్‌ను పట్టుకున్నారు. అతడి ఫోన్ చెక్ చేయగా.. వీడియో తీసినట్లు తేలింది. ఆ వీడియోని హెచ్ఆర్ విభాగం సదరు మహిళ ముందే డిలీట్ చేసేసింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించింది. అతడి ఫోన్లో దాదాపు 30కిపైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియోలన్నీ కార్యాలయం ప్రాంగణంలో రికార్డ్ చేసినవిగా అధికారులు తేల్చారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
Also Read..
GST Relief | మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ రిలీఫ్.. ఆ వస్తువులపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం..?
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి
Delhi CM | 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు