Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta)కు గత నెల అధికారిక నివాసాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించింది. బంగ్లా 1, బంగ్లా 2ను సీఎం కోసం కేటాయించగా.. అందులో బంగ్లా 1లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన టెండర్ నోటీసు ప్రకారం.. సీఎం కోసం బంగ్లా 1, 2 కేటాయించగా.. బంగ్లా 1ని నివాసం కోసం ఉపయోగిస్తున్నారు. రెండో బంగ్లా క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగించనున్నారు. ఇక సీఎం నివాసం ఉండే బంగ్లాకు రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాదు, రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన OTG (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్, రూ.91 వేల విలువైన ఆరు గీజర్లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెంటర్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. అయితే, అంతకముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న సివిల్ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసం వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ బంగ్లాను బీజేపీ ‘శీష్ మహల్’ (Sheeshmahal)గా అభివర్ణిస్తోంది. వివాదాస్పద శీష్ మహల్‌కు దూరంగా ఉండాలని బీజేపీ అప్పుడే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేఖా గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి షాలిమార్ బాగ్‌లో నివాసం ఉంటున్నారు. దీంతో అక్కడికి వచ్చే సందర్శకులు, వీఐపీలు, సీనియర్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక సచివాలయానికి వెళ్లేందుకు రోజూ 25 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.
Also Read..
Sudden deaths | ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదు : కేంద్రం
Ola-Uber | రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్
500 Percent tariff | రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!