Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకూ 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ 20 నుంచి జులై 2 వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ‘ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 51 మంది మరణించారు. దాదాపు 22 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 103 మంది గాయపడ్డారు’ అని సదరు నివేదికలో వెల్లడించింది.
#WATCH | Mandi, Himachal Pradesh: Due to very heavy rainfall in the region, the Beas River is experiencing severe flooding
The India Meteorological Department (IMD) has issued a red alert in Himachal Pradesh pic.twitter.com/VIfegyDuPz
— ANI (@ANI) July 2, 2025
భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి (Mandi) జిల్లాలో బియాస్ నది (Beas River) ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. చండీగఢ్-మనాలీ హైవేలోని మండి-మనాలీ మార్గంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడిన కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలను మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కిపైగా రహదారులను అధికారులు మూసివేశారు. అంతేకాదు 614 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Delhi CM | 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు
Sudden deaths | ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదు : కేంద్రం
Ola-Uber | రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్