న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును రూ.88 లక్షలు (ఒక లక్ష డాలర్లు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ ఇన్నోవేషన్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని, భారత దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వేగవంతమవుతుందనిచెప్పారు. ప్రపంచంలోని ప్రతిభావంతులు సిలికాన్ వ్యాలీ నుంచి భారత దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఇన్నోవేషన్ హబ్స్‌పై దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్పారు.
“డొనాల్డ్ ట్రంప్ పెట్టిన 1,00,000 డాలర్ల హెచ్-1బీ ఫీజు, అంతర్జాతీయ ప్రతిభపై తలుపులు మూసేయడం ద్వారా ప్రయోగశాలలు, పేటెంట్లు, నవ కల్పన, స్టార్టప్‌ల తదుపరి ప్రభంజనాన్ని బెంగళూరు, హైదరాబాద్, పుణే, గురుగ్రామ్‌ల వైపు అమెరికా నెట్టుతున్నది” అని చెప్పారు. మన నిపుణులకు స్వదేశ అభివృద్ధికి తమ పాత్ర పోషించే అవకాశం వచ్చిందని తెలిపారు.