న్యూఢిల్లీ: తాను రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి సేద్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఓ మీడియా సంస్థ కార్యక్రమంలో ఆయన ఇటీవల మాట్లాడుతూ తన దగ్గర 8 వేల పుస్తకాలున్నాయని.. అయితే తీరిక లేక వాటిని చదవలేకపోతున్నానని చెప్పారు. శాస్త్రీయ సంగీతం మీదా తనకు ఆసక్తి ఉందన్నారు. తన సొంత వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసి అధిక దిగుబడులు సాధించానని చెప్పారు.