Amarnath Yatra | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడింది.
కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి శుక్రవారం ప్రకటించారు. పహల్గాం, బల్తాల్ ఉంగా భక్తులను అనుమతించట్లేదని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారికి నిర్వహణ అవసరం కావడంతో ఆ మార్గాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది జులై 2న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 4.10 లక్షల మంది మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Man Missing | విమానంలో చెంపదెబ్బతిన్న ప్రయాణికుడు మిస్సింగ్.. ఆందోళనలో ఫ్యామిలీ
Dam Collapses | ఆకస్మిక వరదలకు కూలిన కాఫర్‌డ్యామ్.. కొట్టుకుపోయిన వాహనాలు.. షాకింగ్ దృశ్యాలు
Nobel Peace Prize | ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా..? భారత్ సమాధానం ఇదే