Manipur | పర్యాటక ప్రాంతాలకు నెలవైన మణిపూర్.. బీజేపీ పాలనలో హింసాత్మక ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఈశాన్య రాష్ట్రం
పర్యాటక ప్రాంతాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్.. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో హింసాత్మక ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
- నాలుగు నెలలుగా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం
- అమాయకుల ప్రాణాలు బలి
- మహిళలపై దారుణాలు
- శాంతి నెలకొల్పడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలం
- చూసీచూడనట్టు వదిలేసిన కేంద్రం
Manipur | ఇంఫాల్: పర్యాటక ప్రాంతాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్.. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో హింసాత్మక ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుకుడుతున్నది. నాలుగు నెలలైనా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. హింసాత్మక ఘటనలను నివారించి, రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంలో కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మే 3న మైతీ, కుకీ తెగల మధ్య మొదలైన రిజర్వేషన్ మంటలు ఇప్పటికీ చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. హింసాత్మక ఘటనల మాటున మహిళలపై అరాచకాలు చోటుచేసుకున్నాయి. యావత్ భారత్ తలదించుకునేలా మహిళలను గన్నంగా ఊరేగించిన ఘటన ఇంటర్నెట్పై నిషేధం కారణంగా చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో 78 రోజుల తర్వాత ప్రధాని మోదీ నోరు మెదిపారు. అల్లర్లను అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికీ మణిపూర్ మంటల్లోనే చిక్కుకొని ఉన్నది.
అంకెల్లో మణిపూర్…
మణిపూర్‌లో అధికారంలో ఉన్నది- బీజేపీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్
అల్లర్లు మొదలైన రోజు- మే 3
మృతులు- 200 మందికి పైగా వైద్య సదుపాయం లేక మరణించినవారు- 45 మంది
నిరాశ్రయులు- 70 వేల మంది
మే 3 నుంచి ఇంటర్నెట్పై నిషేధం- 3,050 గంటలు
శిబిరాల్లో ఉన్న చిన్నారులు- 10 వేలకు పైగా
శిబిరాల్లో ఉన్నవారికి రోజు ఇస్తున్న ఆహారం- 400 గ్రాములు
క్లాసులకు దూరమైన ఎన్ఐటీ మణిపూర్ విద్యార్థులు- 50 మంది
లూటీకి గురైన ఆయుధాలు- 4 వేలకు పైగా
మందుగుండు సామగ్రి- 50 వేల రౌండ్లు
మణిపూర్‌లో ఉన్న గన్ లైసెన్సులు- 35,117
(ఈశాన్య రాష్ర్టాల్లో అక్కడే అధికం.)
2016 నుంచి బీరేన్‌సింగ్ ప్రభుత్వం ఇచ్చిన
లైసెన్సులు- 8 వేలకు పైగా
ధ్వంసమైన చర్చిలు- 220 (ప్రభుత్వ లెక్కల ప్రకారం).
ధ్వంసమైన చర్చిలు- 500కు పైగా
(యూనైటెడ్ క్రిస్టియన్ ఫోరం నివేదిక ప్రకారం)
ఎన్ని రోజులకు మోదీ మౌనం వీడారు-
అల్లర్లు ప్రారంభమైన 78 రోజుల తర్వాత
మోదీ మాట్లాడిన సమయం- 36 సెకండ్లు
మణిపూర్ అల్లర్ల సమయంలో కర్ణాటక ఎన్నికల
సందర్భంగా మోదీ నిర్వహించిన ర్యాలీలు- 19
రోడ్డు షోలు- 06
మణిపూర్‌లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్లు- 11,414
ఆస్తి విధ్వంసం కేసులు- 4,694
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

