PoK | పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆర్మీ (Indian Army) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. కశ్మీర్‌పై స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను అప్పగించడం ఒక్కటే మిగిలి ఉందని పేర్కొన్నాయి.
‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. కశ్మీర్‌పై స్పష్టమైన వైఖరితో ఉన్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను అప్పగించడంపై తప్ప మరో దానిపై చర్చించేది లేదు. పీవోకేని అప్పగించడమే మిగిలి ఉంది. పాకిస్థాన్‌ను బలంగా దెబ్బతీశాం. మనం చేసిన దాడిలో ప్రతి రౌండ్లోనూ పాక్ ఓడిపోయింది. ఈ దాడుల ద్వారా పాక్‌కు గట్టి సందేశం ఇచ్చాం. మే10న పాక్ దాడికి ప్రతిస్పందనగా అగ్ని వర్షం కురిపించాం’ అని సైనిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను జాగ్రత్తగా ఎంచుకున్నట్లు తెలిపాయి. బహవల్పూర్తోపాటు మురుద్కే, ముజఫర్బాద్ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేసినట్లు వివరించాయి.
మరోవైపు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన కల్పుల విరమణ, గగనతల ఉల్లంఘలనపై ఇవాళ సమీక్ష నిర్వహించారు. భద్రతా పరిస్థితిపై పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్లతో చర్చించారు. ప్రతిస్పందన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆర్మీ కమాండర్లకు ఇస్తూ నిర్ణయించారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ‘ఆపరేషన్ సిందూర్’, కాల్పుల విరమణ పై మాట్లాడే అవకాశం ఉంది.
Also Read..
BrahMos missile | బ్రహ్మోస్ శక్తి గురించి పాకిస్థాన్‌ను అడగండి : యూపీ సీఎం యోగి
Rahul Gandhi | పార్లమెంట్ ప్రత్యేక సెషన్ నిర్వహించండి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
Indian Air Force | ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది.. వదంతులు నమ్మొద్దు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్