Indian Air Force | ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది.. వదంతులు నమ్మొద్దు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Indian Air Force | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) కీలక ట్వీట్ చేసింది.
Indian Air Force | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) కీలక ట్వీట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. అత్యంత కచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో నిర్వర్తించినట్లు తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దని సూచించింది. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టింది.
‘ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. మాకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశాం. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అత్యంత కచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో నిర్వర్తించాం. సైనిక చర్యలు కొనసాగుతున్నందన సమయానుకూలంగా వివరాలు వెల్లడిస్తాం. అధికారికంగా వెల్లడించే వరకు వదంతులు వ్యాప్తి చేయొద్దు. ధృవీకరణ లేని వార్తలను నమ్మొద్దని కోరుతున్నాం’ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives.
Since the Operations are still ongoing, a detailed…
— Indian Air Force (@IAF_MCC) May 11, 2025
Also Read..
Indus Treaty | కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. సింధు జలాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు
PM Modi | త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

