Fake Social Account | పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ గురించి భారత సర్కార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా సైనికాధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. వాళ్లే భారత ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Qureshi), భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్-హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్ (Vyomika Singh). భారత్ చేపట్టిన ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించడంతో పాటు, తదుపరి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తున్నారు. అయితే, ఈ మహిళా సైనికాధికారుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు (Fake Social Account) వెలుగులోకి రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌ల పేర్లతో ఫేక్ ‘ఎక్స్’ ఖాతాలు పుట్టుకొచ్చాయి. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి తాజా చిత్రాలతో ఈ అకౌంట్లు ఎక్స్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ ఖాతాలకు బ్లూ టిక్ కూడా ఉండటం గమనార్హం. దీంతో చాలా మంది నెటిజన్లు అవి నిజమైన ఎక్స్ ఖాతాలే అనుకొని వారిని అనుసరించడం మొదలు పెట్టారు. అయితే, తాజాగా అవి నకిలీవని తేలింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ ఖాతాలు నకిలీవని తేల్చింది. ప్రజలు ఇటువంటి నకిలీ ఖాతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read..
Indus Treaty | కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. సింధు జలాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు
PM Modi | త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ
Donald Trump | కశ్మీర్ సమస్య కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా : డొనాల్డ్ ట్రంప్