Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఈసారి యూపీలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), విపక్ష ఇండియా కూటమి 79 స్ధానాలను గెలుచుకుంటుందని కేవలం ఒకే ఒక్క స్ధానంలో పోటీ ఉంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బారాబంకిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బారాబంకి ఎస్పీకి కంచుకోట వంటిదని అన్నారు.
యూపీలో దళితులు, మైనారిటీలు, ఓబీసీలు ఎన్డీయేను ఓడించబోతున్నారని, ఈ వర్గాలను బీజేపీ మోసగించిందని, వారికి దక్కాల్సిన హక్కులు, గౌరవం దక్కలేదని అఖిలేష్ అన్నారు. అందుకే అణగారిన వర్గాలు ఈసారి కాషాయ పార్టీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
బీజేపీ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని, ఈసారి యూపీలో ఇండియా కూటమికి అత్యధిక స్ధానాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తమ ఎంపీలు ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బహుజనులు ఇండియా కూటమికి కాకుండా మరో పార్టీకి ఓటు వేసి వృధా చేయవద్దని అఖిలేష్ విజ్ఞప్తి చేశారు.
Read More :