Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే సర్కార్కే ప్రజలు పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపధ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ ర్యాలీపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు.
స్టాక్ మార్కెట్ పెరుగుదల నుంచి లాభపడాలని ఇన్వెస్టర్లు చూస్తున్నారని, రేపు వారు లాభాల స్వీకరణకు దిగుతారని అఖిలేష్ వ్యాఖ్యానించారు. సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు పెరుగుదలను ప్రస్తావిస్తూ లాభాలు దండుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో రేపు ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి లాభాలను తీసుకొని వెళతారని వ్యాఖ్యానించారు.
రేపు ఎన్నికల ఫలితాల్లో జాప్యం చేయడంతో పాటు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని అఖిలేష్ పేర్కొన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్లో జోష్ నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1859 పాయింట్లు ఎగబాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 603 పాయింట్లు పెరిగింది. ప్రధానంగా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్, శ్రీరాం ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు భారీగా లాభపడ్డాయి.
Read More :
Wine Shops | రేపు మద్యం దుకాణాలు బంద్.. హైదరాబాద్‌లో 144 సెక్షన్