Wine Shops | రేపు మద్యం దుకాణాలు బంద్.. హైదరాబాద్‌లో 144 సెక్షన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలు అమలుచేయనున్నారు. అదేవిధంగా వైన్స్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎవరైన అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో గత నెల 13న లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసింది. ఓట్లను జూన్ 4న లెక్కించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

