Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు తాను ఎన్డీయే పాలకుల గురించి హెచ్చరించానని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎన్నో సంస్ధలున్నాయని, వాటిని అడ్డుపెట్టుకుని ఎప్పటికప్పుడు రాజకీయ నేతలను వేధిస్తారని చెప్పానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న దర్యాప్తు ఏజెన్సీలు పాలక పార్టీ రాజకీయ ప్రత్యర్ధులకు న్యాయం చేయవని, తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్ధల కుట్రలకు చరమగీతం పాడతామని చెప్పానని గుర్తుచేశారు. తాము ఇలాంటి సంస్దలపై వేటు వేస్తామని, మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరినీ తప్పుడు కేసులతో వేధించరాదని స్పష్టం చేశారు.
అఖిలేష్ అంతకుముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్కు మెజారిటీ ఉండేదని, ఇప్పుడు వారికి మెజారిటీ లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం కొనసాగబోదని, ఇది ఎప్పుడైనా కుప్పకూలే సర్కారేనని అఖిలేష్ జోస్యం చెప్పారు. ఎప్పుడైనా పతనమయ్యే ఈ సర్కార్కు తాము ఒక్కటే చెబుతున్నానమని ఏ ఒక్కరికీ అన్యాయం చేయవద్దని మాత్రమే తాము కాషాయ పాలకులను కోరుతున్నామని అన్నారు. బీజేపీ ఉద్యోగాలు కల్పించదని, ఉపాధి కల్పనను విస్మరించడం, ధరల పెరుగుదల కారణంగానే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
Read More :