Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. గత పదేండ్ల బీజేపీ హయాంలో పారిశ్రామికవేత్తల రుణాలు రూ. 25 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. యూపీలోని అజాంఘఢ్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
జూన్ 4 తర్వాత బీజేపీ బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుందని, అయితే విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తల రుణాలు కాకుండా పేదలు, రైతులు, గ్రామాల్లో నివసిస్తున్న సామాన్యుల రుణాలను మాఫీ చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
కాషాయ పాలనలో బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులకే మేలు జరిగిందని అన్నారు. ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన పారిశ్రామిక దిగ్గజాలకు దేశ సంపదను దోచిపెట్టారని విమర్శించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.
Read More :