Akhilesh Yadav | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పేద మహిళలకు ఏటా రూ.40 వేలు : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడటంతో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో అధికార బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వ్యూహాలు రచిస్తున్నారు.
Akhilesh Yadav : అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడటంతో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో అధికార బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎస్పీ హామీలు గుప్పిస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కీలక ప్రకటనలు చేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాదు 12వ తరగతి పూర్తయిన 25 లక్షల మంది బాలికలకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించారు. వీటితోపాటు ‘రాణి లక్ష్మీబాయి పథకం’ ద్వారా విద్యార్థినులకు 50 వేల ఉచిత స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది.
మరోవైపు అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తూ అఖిలేశ్ యాదవ్ ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ వేదికగా 10 భారీ హామీలతో ముందుకు వచ్చారు. పేద మహిళలకు ఏటా రూ.40 వేలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఈ మొత్తాన్ని పెంచుతామని మాటిచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ప్రతి నెలా రెండు రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, వితంతువులు, నిరుపేదలకు శాశ్వత గృహాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
విద్యా రంగానికి సంబంధించి 12వ తరగతి బాలికలకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఫీజు మాఫీ, ప్రైవేట్ బడుల్లో సగం ఫీజు భరిస్తామని తెలిపారు. ప్రతి తహసీల్‌లో పీజీ కళాశాల, జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు, మూతపడిన 26 వేల పాఠశాలలను తిరిగి తెరిపిస్తామని, మహిళలపై నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నెలకొల్పుతామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

