పదవి ముగిసినా.. కుర్చీ దిగుతలే
రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసినా ఇంకా అదే హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్‌గా శివసేనారెడ్డి రెండేండ్ల పదవీకాలం జూలైలోనే ముగిసినా ఆయన కుర్చీని వదలడం లేదు.
- ఇంకా అధికారిక హోదాలోనే కొనసాగుతున్న శివసేనారెడ్డి
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసినా ఇంకా అదే హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్‌గా శివసేనారెడ్డి రెండేండ్ల పదవీకాలం జూలైలోనే ముగిసినా ఆయన కుర్చీని వదలడం లేదు. ఎల్బీ స్టేడియంలోని తన చాంబర్‌ను ఖాళీ చేయకుండా ఇంకా చైర్మన్‌గానే చలామణి కావడంపై విమర్శలు వస్తున్నాయి.
గత నెల 29న జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే అధికారిక వేడుకలకు చైర్మన్ హోదాలో హాజరైన ఆయన మంగళవారం ఎల్బీ స్టేడియంలోని చైర్మన్ చాంబర్లో ఏకంగా అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. శాట్ క్రీడా ప్రాంగాణల్లో కోచింగ్ ఫీజుల పెంపు అంశంపై శివసేనారెడ్డి, ఎండీ సోనిబాలా దేవి.. ఉన్నతాధికారులు, స్టేడియాల అడ్మినిస్ట్రేటర్లు, కోచ్‌లతో సమీక్ష నిర్వహించారు. దీనిపై శివసేనారెడ్డిని వివరణ కోరగా.. తనకు మరో టర్మ్ ఎక్స్టెన్షన్ ఖరారైందని, ఉత్తర్వులు రావడమే ఆలస్యమని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

