Akhilesh Yadav | లక్నో : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆయన గురువారం ఆ పార్టీ అయోధ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నవారు విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, అందులో భాగమే భూమికి సంబంధించిన దోపిడీలని చెప్పారు. బీజేపీ నేతలు, అధికారులు భూ దోపిడీలకు పాల్పడ్డారన్నారు. ఈ చీకటి వాస్తవాలను బయటపెట్టినందుకు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను అభినందించారు. అయోధ్య వంటి పవిత్రమైన స్థలంలోనే ఇటువంటి ఆక్రమణలకు పాల్పడ్డవారు, మిగతా జిల్లాల్లో ఇంకెన్ని దారుణాలకు పాల్పడి ఉంటారో ఊహించుకోవచ్చునని తెలిపారు. అయోధ్య అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారంటూ అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. భారత న్యాయ సంహిత నిబంధనల కింద ఆయనపై కేసు నమోదు చేయాలని, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ పిటిషనర్ హైకోర్టును కోరారు. రాహుల్‌గాంధీ పౌరసత్వంపై ఆరోపణలు రావటం ఇదే మొదటిసారి కాదు. ఇదే విషయమై రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆయన కోర్టుకు ఆధారాలు అందజేశారు.