Ajit Doval | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ జరిపిన దాడుల్లో భారత్‌వైపు భారీగా నష్టం జరిగిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని (foreign media reports) ఆయన తిప్పికొట్టారు. భారత్‌కు నష్టం జరిగిందని రుజువు చేసే ఒక్క ఫొటో అయినా చూపించగలరా (Show one photo of damage in India) అని సివాల్ విసిరారు.
చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అజిత్ ధోవల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 23 నిమిషాల పాటూ జరిగిన ఈ ఆపరేషన్‌లో సరిహద్దుకు దూరంగా పాకిస్థాన్లోపల ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్లు చెప్పారు. అందులో ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని.. నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు వివరించారు.
‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై పాక్ అలా దాడి చేసింది. ఇంత నష్టం జరిగిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసింది. కానీ భారత్‌కు ఈ ఆపరేషన్‌లో ఎలాంటి నష్టం జరగలేదు. ఏ ఒక్కటీ ధ్వంసం కాలేదు. భారత్‌కు నష్టం జరిగిందని రుజువు చేసే ఒక్క ఫొటో అయినా చూపించగలరా..? దాడి తర్వాత పాక్‌లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా రాలేదు. భారత్‌కు చెందిన ఆయుధ స్థావరాలపై చిన్నగీత కూడా పడలేదు’ అని అజిత్ ధోవల్ వ్యాఖ్యానించారు.
Also Read..
Priya Nair | హెచ్‌యూఎల్‌కు తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?
Himachal Pradesh | వరదల్లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు
CM Siddaramaiah | నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య