Technical Glitch | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అలయన్స్ ఎయిర్‌లైన్స్‌కు (Alliance Air flight) చెందిన విమానం సిమ్లా (Shimla) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో హిమాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ముకేశ్ అగ్నిహోత్రి (Mukesh Agnihotri), డీజీపీ అతుల్‌వర్మ సహా 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
A pilot of flight no. 9I821 Alliance Air flight from Delhi to Shimla reported technical glitch in brake of the flight during landing at Shimla airport on Monday morning. All 44 passengers including Deputy CM Of Himachal Pradesh, Mukesh Agnihotri and DGP Dr Atul Verma are safe.…
— ANI (@ANI) March 24, 2025
అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ నెంబర్ 91821 విమానం సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి సిమ్లాకు బయల్దేరింది. సిమ్లాలోని జుబ్బర్హట్టి విమానాశ్రయంలో (Jubbarhatti Airport) ల్యాండింగ్ సమయంలో విమానం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. పైలట్ ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేశారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం అదుపుతప్పి రన్‌వేని దాటి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
All the 44 passengers and crew are safe at Jubbarhatti Airport in Shimla, India after the aircraft (VT-UDB) could use only half of the Runway and came to a stop at the end of the Runway (14/32) on 24 March.
On the Monday morning event at the Shimla Airport, the Alliance Air ATR… pic.twitter.com/t869MzKJbq
— FL360aero (@fl360aero) March 24, 2025
Also Read..
Araku Coffee | పార్లమెంట్లో అరకు కాఫీ ఘుమ ఘుమలు
Rahul Gandhi | ప్రధాని మోదీ ఆ సమస్యపై కూడా మాట్లాడాలి : రాహుల్‌గాంధీ