బెంగళూరు: ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో అల్లాడిపోయారు. చివరకు వైద్య సిబ్బంది మాన్యువల్‌గా ఆక్సిజన్ అందించారు. (Oxygen crisis in Karnataka hospital) కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ప్రముఖ గుల్బర్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో గందరగోళం నెలకొన్నది. హాస్పిటల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగా, ఆ హాస్పిటల్లో బ్యాటరీ బ్యాకప్ లేకపోవడంతో ఐసీయూ వార్డులో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో శ్వాసకోశ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మాన్యువల్‌గా ఆక్సిజన్‌ను పంప్ చేశారు.
మరోవైపు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు ఆక్సిజన్ కోసం క్రిటికల్ రోగులు చాలా ఇబ్బందిపడ్డారు. వారి పరిస్థితి చూసి రోగుల బంధువులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్యాటరీ బ్యాకప్ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Power failure in Kalaburagi GIMS , nurses pumps manually to supply oxygen. patients life at high risk. who is responsible for this ?
Under @INCKarnataka govt the healthcare in Karnataka is at High risk !@BJP4Karnataka @AsianetNewsSN @BYVijayendra @BasanagoudaBJP @amitmalviya pic.twitter.com/gmZqBXTzB5— Harrsha S Guttedar BJP ( ಹರ್ಷಾ ಎಸ್ ಗುತ್ತೇದಾರ ) (@harshaguttedar7) March 22, 2025