న్యూఢిల్లీ, జూన్ 24: జూన్ 12నాటి అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. మొత్తం మృతుల్లో విమాన ప్రయాణికులు 241 మందికాగా, మరో 34 మంది ఘటనాస్థలానికి చెందిన ఇతరులుగా పేర్కొన్నది.
ప్రమాద ఘటన తర్వాత మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడటం ఇదే మొదటిసారి. మృతదేహాలన్నీ స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 260 మృతదేహాల్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా, ఆరు మృతదేహాలల్ని ముఖ గుర్తింపు ద్వారా గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.