న్యూఢిల్లీ: పలు సాంకేతిక సమస్యలు గుర్తించిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిని సీరియస్‌గా పరిగణించింది. సంబంధిత ఎయిర్ ఇండియా పైలట్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. (Show Cause Notice to Air India Pilots) దూర విదేశీ ప్రయాణాలకు వినియోగించిన ఎయిర్ ఇండియా విమానాల్లో ఇటీవల పలు సాంకేతిక సమస్యలను గుర్తించారు.
కాగా, ఢిల్లీ-టోక్యో ఎయిర్ ఇండియా విమానంలో పలు సిస్టమ్ హెచ్చరికలు, డోర్ వద్ద పొగను పైలట్లు గుర్తించారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆ విమానంలో పలు సమస్యలు తలెత్తాయి. శీతలీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య వల్ల విమానాన్ని కోల్‌కతాకు మళ్లించారు.
మరోవైపు వీటీ-ఏఎన్ఐగా నమోదైన విమానం సాగించిన ఐదు ప్రయాణాల్లో పలు సాంకేతిక సమస్యలను గుర్తించినట్లు డీజీసీఏ దృష్టికి వచ్చింది. కొన్ని భద్రతా పరికరాలు నిర్దేశించిన ప్రమాణాలను పాటించనప్పటికీ ఆ విమానాన్ని నడిపారు. ఎంఈఎల్ వ్యవస్థ వైఫల్యాలు, సమస్యల గురించి తెలిసినప్పటికీ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు పైలట్లు అంగీకరించినట్లు డీజీసీఏ ఆరోపించింది. విమాన భద్రతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశమున్నదని హెచ్చరించింది.
కాగా, పలు సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ఆయా విమానాలను నడిపేందుకు అంగీకరించిన ఎయిర్ ఇండియా పైలట్లకు డిసెంబర్ 29న డీజీసీఏ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ నియమాలు ఉల్లంఘించినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో అన్నది 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. పైలట్ల ప్రతిస్పందన ఆధారంగా వారిపై నియంత్రణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. డీజీసీఏ నోటీసులను ఎయిర్ ఇండియా అధికారి ధృవీకరించారు.
Also Read:
Cigarette and Beedi Costlier | పెరుగనున్న సిగరెట్టు, బీడీ, పాన్ మసాలా ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Drugs Supplying To Students | విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్ సహా ఏడుగురు అరెస్ట్
Watch: ఇంటి ముందు కూర్చొన్న వృద్ధురాలు.. కోతులు ఏం చేశాయంటే?