న్యూఢిల్లీ : పాక్ గగనతలాన్ని మూసివేయడం వల్ల సంభవించిన నష్టాల నుంచి బయటపడటానికి రూ.4,000 కోట్లు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎయిరిండియా కోరింది. పహల్గాం ఉగ్ర దాడి అనంతరం తమ సంస్థ తీవ్రంగా నష్టపోయిందని తెలిపింది.
ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పిలిచింది. ఇదిలావుండగా, పాక్ గగనతలం మూసివేతను కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన ఏకైక సంస్థ ఎయిరిండియా. దీంతో విల్సన్‌పై విమర్శలు వస్తున్నాయి.