Air India | ముంబై (Mumbai) నుంచి న్యూయార్క్ (New York)కు బయలుదేరిన ఓ విమానం సాంకేతిక సమస్య (technical issue) కారణంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఏఐ119 విమానం మంగళవారం తెల్లవారుజామున 2:19 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి బయలు దేరింది.
అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాన్ని ముందు జాగ్రత్తగా తిరిగి ముంబై మళ్లించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేసి వారందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Chiranjeevi | ఆయన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి.. త్రిషకు మద్దతుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
Rasgulla | పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి గాయాలు
RamNath Kovind | జమిలితో ప్రజలకే ప్రయోజనం : రామ్‌నాథ్ కోవింద్