Rasgulla | పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి గాయాలు
Rasgulla | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల (Rasgullas) కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు.
Rasgulla | వివాహ వేడుక (Wedding Function) అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పసందైన వంటకాలే. ఈ వేడుకల్లో ఎన్నో రకాల వంటకాలను అతిథులకు వడ్డిస్తారు. అయితే, ఒక్కోసారి జనం ఎక్కువైనప్పుడు కొంత కొరత ఏర్పడుతుంది. చివరి బంతికి వచ్చేసరికి కొన్ని వంటకాలు అయిపోతుంటాయి. ఆ సమయంలో ఉన్నవాటితోనే సరిపెడుతుంటారు. అలా ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లాల (Rasgulla) కొరత ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
స్థానిక శంషాబాద్ ప్రాంతం (Shamsabad area)లో ఆదివారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా అతిథులకు పసందైన వంటకాలు వడ్డించారు. అయితే, కాసేపటికి పెళ్లి వేడుకలో వడ్డించిన రసగుల్లాలు అయిపోయాయి. కొందరికి అందలేదు. దీంతో ఓ వ్యక్తి రసగుల్లాల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి అనిల్ శర్మ తెలిపారు.
క్షతగాత్రులను భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్‌గా గుర్తించారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్పూర్లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Also Read..
Chiranjeevi | ఆయన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి.. త్రిషకు మద్దతుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
Etamatam | ప్రచారానికి పోతే వీపు సాపే.. జనాల దగ్గరికి వెళ్లాలంటేనే భయపడిపోతున్న వారంటీల లీడర్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

