Etamatam | ప్రచారానికి పోతే వీపు సాపే.. జనాల దగ్గరికి వెళ్లాలంటేనే భయపడిపోతున్న వారంటీల లీడర్లు
Etamatam | టీవీలో తెలంగాణ ఎన్నికలపై చర్చ జరుగుతున్నది. రామకోటయ్య ఇంట్రెస్టింగ్గా సూస్తున్నడు. పేరు‘మాసిన’ ఓ విశ్లేషకుడు ‘గాలి ఆల్ల వైపే ఈస్తున్నది’ అన్నడు. రామకోటయ్య ఎగిరి గంతేసిండు. వెంటనే ‘అరేయ్ సత్తి! బండి తీరా పచారానికి పోదాం. ఈసారి గాలి మనవైపే ఈస్తుందంటా’ అన్నడు.
Etamatam | టీవీలో తెలంగాణ ఎన్నికలపై చర్చ జరుగుతున్నది. రామకోటయ్య ఇంట్రెస్టింగ్గా సూస్తున్నడు. పేరు‘మాసిన’ ఓ విశ్లేషకుడు ‘గాలి ఆల్ల వైపే ఈస్తున్నది’ అన్నడు. రామకోటయ్య ఎగిరి గంతేసిండు. వెంటనే ‘అరేయ్ సత్తి! బండి తీరా పచారానికి పోదాం. ఈసారి గాలి మనవైపే ఈస్తుందంటా’ అన్నడు. ‘గాలి మనవైపు ఈస్తుందో! మనమే గాల్లో కొట్టుకపోతమో’ అని గొణిగిండు సత్తి. ‘ఏంట్రా ఏదో గొణుగుతున్నవు’ అన్నడు రామకోటయ్య. ‘ఏం లేదు అన్న బండి తీస్తున్న’ అన్నడు. ఆ మాసిపోయి దుమ్ముపట్టిన పార్టీ కండ్వా అందుకున్నడు రామకోటయ్య. ఇద్దరు కలిసి మందీమార్బలాన్ని వెంటేసుకొని పచారానికి బయల్దేరిర్రు.
కొంతదూరం పొయినంక ‘బండి ఆపరా సత్తి.. ఈడ నుంచే పచారం షురూ చేద్దం’ అన్నడు రామకోటయ్య. ‘పోయిపోయి మేఘాల్ని తాకే డబుల్ బెడ్రూం మేడలున్న కేసీఆర్ నగర్లో పచారం ఏందన్నా. ఆడ పచారం జేసిన ఓట్లు పడవే’ అన్నడు సత్తి. ‘చల్ తీ నీ మాట ఇనేదేంది. గిన్నే ఆపు’ అని అన్నడు. ఇక జేసేదేం లేక మిషన్ భగీరథ ట్యాంకు పక్కపొంటి బండి ఆపిండు సత్తి. మైకులు, గైకులు ఆన్ జేసి డీజే పాటలు ఎట్టంగనే.. ఏదో సర్కసు అనుకొని జనం జమైర్రు. ఆల్లను జూడంగనే రామకోటయ్యకు ఏడ లేని ఉత్సాహం పొంగుకొచ్చింది. ఇక షురూ జేసిండు. ‘గ్యారంటీలు ఇస్తం.. వారంటీలు ఇస్తం. మాకే ఓటెయ్యాలే. కేసీఆర్ ఏం జేసిండు. మన్నూమశానం.. ’ నోట్లో మాట నోట్లనే ఉండే. మాకు ‘ఆసరా’గా ఉన్న కేసీఆర్‌నే అంటవారా అని ఓ ముసలవ్వ ఊతకర్ర తీస్కొని వీపు విమానం మోత మోగించింది. గీ మధ్యనే ‘కల్యాణలక్ష్మి’ తీస్కొని లగ్గం జేస్కున్న లచ్చుమమ్మ చెంప ఛెల్లుమనిపించింది. సంకలో పిల్లాన్ని ఎత్తుకొని గప్పుడే అటుదిక్కు అత్తున్న గంగవ్వ ‘కేసీఆర్ కిట్’తోని ఒక్కటిచ్చింది. రైతుబంధు పైసలు జేబులేస్కొని అట్నుంచి ఖుషిగొత్తున్న నర్సి దుడ్డు కర్రందుకొని దబదబ బాదిండు. నేనేమైన తక్కువ తిన్ననా అని ఓ బుడ్డోడు ‘కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్’ తిన్న బలాన్నంతా జమేసుకొని నెత్తిన ఒక్కటిచ్చిండు. వామ్మో.. వాయ్యో అనుకుంట సత్తి, రామకోటయ్య పరుగందుకున్నరు. జనాలు తరిమితరిమి కొట్టిర్రు.
పరుగెత్తి.. పరుగెత్తి అల్సిపోయిన రామకోటయ్య, సత్తి ఊరి బయటున్న ‘హరితహారం’ చెట్ల కింద సాగిలపడ్డరు. కుయ్యో.. మొర్రో అని రామకోటయ్య మూలుగుతుండే. సస్తడేమోనని సత్తి వెంటనే పక్కూరివోయి ‘మిషన్ భగీరథ’ నీళ్లు తెచ్చి ఇచ్చిండు. కాస్త నిమ్మలమైన రామకోటయ్య ‘ఏందిర అట్ల కొట్టిర్రు. సచ్చేటట్టు ఉన్న’ అన్నడు. ‘కొట్టరా మరి దేవుడసంటోడు కేసీఆర్‌ను అంటే పొట్టుపొట్టు కొడ్తరు. అ యినా ఈ బతుకు బతుకుడెందుకు సావరాదే. రైతు బీమా అయిన అస్తది’ అని సత్తి గొణిగిండు. అదిన్న రామకోటయ్య ‘ఏందిరా గొణుగుతున్నవు’ అన్నడు. ‘ఏం లేదు అన్న ఆల్ల కొట్టుడుకు వీపంతా వాపొచ్చింది. ఒళ్లంతా మంట పుడతాంది’ అన్నడు. ‘అవురా సత్తి నా వీపు గిట్ల సాపైంది’ అనుకుంట ఊర చెర్వు వైపు లగెత్తిండు. ‘కొంపదీసి నా మాటలు ఇన్నడా ఏంది. సస్తడేమో’ అని సత్తి ఆలోచనలో పడ్డడు. ‘ఓ అన్నో ఊర చెర్వులో దుంకేవు. ‘మిషన్ కాకతీయ’లో మట్టంతా ఎత్తిపోసిర్రు. స్తంభం లోతుంటది. దుంకితే సస్తవు’ అనుకుంట సత్తి గిట్ల ఆయనెంటే పరుగెత్తిండు. అంతట్లోనే రామకోటయ్య చెర్వులో దుం కిండు. వామ్మో.. వాయ్యో అనుకుంట సత్తి చెర్వుకాడికివోయిండు. జూ స్తే సడీసప్పుడు లేదు. సత్తికి భయమైంది. ‘అన్న ఉన్నవా.. పోయినవా. జర చెప్పే. పక్కనే ‘వైకుంఠధామం’ ఉన్నది కట్టెలు పోగేసుకుంట’ అని కేకేసిండు. అంతట్లోనే మూలుక్కుంట రామకోటయ్య పైకి తేలిండు. ఎలచ్చన్లు అద్దు.. ఏమద్దు.. అని ఇద్దరు కల్సి ఇంటిబాట పట్టిర్రు.
…?మాలోతు సురేశ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

