Airindia flight : ఘజియాబాద్ (Gahziabad) నుంచి కోల్‌కతా (Kolkata) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Airindia Express flight) లో సాంకేతికలోపం తలెత్తింది. ఎయిరిండియాకు చెందిన IX 1511 విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే ముందు సిబ్బంది సమస్యను గుర్తించారు. దాంతో విమానాన్ని నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
గ్రౌండ్ ఇంజినీర్లు వచ్చి సమస్యను సరిచేశారు. సాంకేతిక సమస్య కారణంగా విమానం సుమారు ఒక గంటపాటు ఎయిర్‌పోర్టులో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ విమానాన్ని గతంలో రక్షణ శాఖలో బలగాలను సామాత్రిని తరలించేందుకు వినియోగించారు. ఈ మధ్యనే దీన్ని పౌర యానానికి వినియోగిస్తున్నారు. విమానంలో సమస్య కారణంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.