Air India | ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing 787-8 Dreamliner) రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ (Hong Kong) నుంచి ఢిల్లీకి బయల్దేరింది. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్.. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు దృష్టికి చేరవేశారు. అనంతరం విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Air India flight AI315 en route from Hong Kong to Delhi was forced to return to its origin after the pilot suspected a technical issue mid-air. The flight, AI315, operated by a Boeing 787-8 Dreamliner, departed Hong Kong for Delhi: Sources
— ANI (@ANI) June 16, 2025
ఇటీవలే అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే రకానికి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం.
Also Read..
Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాలు గుర్తింపు
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌కు బోయింగ్ నిపుణులు.. దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్
Hajj flight | వీల్ నుంచి మంటలు.. దేశంలో తప్పిన ఘోర విమాన ప్రమాదం