MiG-29 | భారత వాయుసేనకు చెందిన మిగ్-29 ఫైటర్జెట్ (MiG-29 fighter jet) సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయిన (Crashes) విషయం తెలిసిందే. సాధారణ శిక్షణలో భాగంగా పంజాబ్లోని అదంపూర్ నుంచి యూపీలోని ఆగ్రాకు ప్రయాణిస్తున్న ఈ యుద్ధవిమానం సాంకేతిక సమస్య కారణంగా కూలిపోయింది.
పారాచూట్ సాయంతో పైలట్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఫైటర్ జెట్ కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. అయితే, యుద్ధ విమానం కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ విమానం భూమిని చేరడానికి ముందు వేగంగా కిందకు పడిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. అంతేకాదు.. పారాచూట్ సాయంతో పైలట్ బయటకు రావడం కూడా కనిపిస్తోంది.
#BreakingNews
Flat spin, ejection and crash !!!A MiG-29 fighter jet of the Indian Air Force (IAF) crashed today ( Nov 4, 2024) near Agra, India.
The fighter jet crashed into a field during a routine training sortie, after encountering a system malfunction. The pilot ejected… pic.twitter.com/fE22X9RjLw
— Dreams N Science (@dreamsNscience) November 4, 2024
Also Read..
Virat Kohli | విరాట్ కోహ్లీ బర్త్డే.. సాగర తీరంలో ఆకట్టుకుంటున్న సైకతశిల్పం.. VIDEO
Salman Khan | రూ.5 కోట్లు ఇవ్వాలి లేదంటే.. సల్మాన్ను చంపేస్తాం