Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) పుట్టిన రోజు నేడు. అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా.. సమర్ధుడైన నాయకుడిగా జట్టుపై తన ముద్ర వేసిన కోహ్లీ నేడు 36వ వసంతంలో అడుగుపెట్టాడు (Virat Kohli birthday). ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఆటగాళ్లు, సీనియర్ క్రికెటర్లు, అభిమానులు ఈ క్రికెట్ కింగ్‌కు విషెస్ తెలుపుతున్నారు.
ఇక ప్రముఖ సైకత శిల్పి (sand artist) సుదర్శన్ పట్నాయక్ ( Sudarsan Pattnaik) సైతం కోహ్లీకి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి సాగర తీరంలో (Puri Beach) ప్రత్యేకంగా సైకత శిల్పం రూపొందించారు. క్రికెట్ మైదానంపై విరాట్ ఉన్నట్లు ఈ శిల్పాన్ని ఎంతో చక్కగా రూపొందించారు. బ్యాట్‌పై హ్యాపీ బర్త్‌డే విరాట్ అంటూ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సైకత శిల్పం నెటిజన్లను, కోహ్లీ అభిమానులను విశేషంగా ఆటకట్టుకుంటోంది.
Happy Birthday to the legendary Virat Kohli! .
Your passion, dedication, and incredible performances continue to inspire millions around the world. Wishing you a year filled with success and happiness! . My SandArt at Puri beach in Odisha.
#HappyBirthdayViratKohli pic.twitter.com/xAB5iPjjEz— Sudarsan Pattnaik (@sudarsansand) November 5, 2024
Happy birthday to the incredible cricket icon @imVkohli , a legend in every format of the game, My SandArt at Puri beach in Odisha. #HappyBirthdayViratKohli pic.twitter.com/C3dlnsGNt0
— Sudarsan Pattnaik (@sudarsansand) November 5, 2024
Also Read..
Salman Khan | రూ.5 కోట్లు ఇవ్వాలి లేదంటూ.. సల్మాన్‌ను చంపేస్తాం
Air Pollutions | ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం.. అత్యవసరమైతే బయటకు రావొద్దని సూచన..!
US Election | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ భాషలోనూ బ్యాలెట్ పేపర్