బీజేపీని ఓడిద్దాం.. శివసేన కూటమితో జట్టుకట్టిన MIM
MIM | శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎంఐఎం.. మరో కాషాయ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికింది.
ముంబై: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎంఐఎం.. మరో కాషాయ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికింది. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఈ మేరకు ఎంఐఎంకు చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశారు.
హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్నది. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఆరు స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హీ పోటీలో ఉన్నారు. దీంతో ఆయనకు మద్దతు తెలపాలని ఎంఐఎం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేయనున్నారు.
We laid certain conditions related to development of our MLAs constituencies in Dhulia and Malegaon. Also demanded Govt to appoint a minority member in MPSC and to take steps to increase the income of Maharashtra Wakf Board. Also demanded reservations for Muslims.
— Imtiaz Jaleel (@imtiaz_jaleel) June 9, 2022
ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ భవితవ్యం తేలనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

