మేడ్చల్, జనవరి 4(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై సంద్ధిగం ఏర్పడింది. వార్డుల విభజనలో గందరగోళంలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన అగిపోయినట్లేనన్న అనుమానాలు వస్తున్నాయి. 15 మండలాల్లో 1,64,903 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో ఇప్పటి వరకు 99,102 మాత్రమే పూర్తికాగా ఇందులో 49, 950 దరఖాస్తులకు సంబంధించి నిబంధనల మేరకు సరైన ధ్రువీకరణపత్రాలు ఉన్న నేపథ్యంలో రుసుం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. 49, 950 మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. మిగతా 49, 150 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చివరి దశకు చేరిందని చెబుతున్నా.. ఇప్పటి వరకు దరఖాస్తుదారులకు ఎలాంటి నోటీసులు జారీ కాలేదు. మిగతా 65 వేల దరఖాస్తుల పరిశీలనపై ఎలాంటి క్లారిటీ లేదు.