 
                                                            చెన్నై: శశికళ సహాయకుడైన కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan)ను ఏఐఏడీఎంకే బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను తొలగించారు. సెంగోట్టయన్తో ఎవరూ కలవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. దీనిపై ఆయన స్పందించారు. శనివారం తన స్పందన తెలియజేస్తానని అన్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సెంగోట్టయన్ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం జయలలిత సహాయకురాలు శశికళ, దినకరన్, మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంను క్షమించాలని, వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఐక్య అన్నాడీఎంకే మాత్రమే అధికార డీఎంకేను ఓడించగలదని గట్టిగా వాదించారు.
కాగా, తొలగించిన ఆ ముగ్గురిని పార్టీలోకి తిరిగి తెచ్చేందుకు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కే పళనిస్వామి (ఈపీఎస్)కు సెంగోట్టయన్ నెల గడువు ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆయన డిమాండ్‌పై ఈపీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో చర్యలు తీసుకుంటామని గత నెలలో హెచ్చరించారు.
మరోవైపు తమిళనాడులో బీజేపీకి ‘బీ’ టీమ్‌గా భావించే ఓ పన్నీర్‌సెల్వం, శశికళ, దినకర్‌తోపాటు సెంగోట్టయన్ గురువారం దక్షిణ తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కలుసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయంగా ప్రభావవంతమైన తేవర్ సమాజంలో చారిత్రక వ్యక్తి పసుంపోన్ ముత్తురామలింగ తేవర్‌కు నివాళులు అర్పించడానికి వారు సమావేశమయ్యారు. అయితే అన్నాడీఎంకే ఏకీకరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది జరిగిన ఒక రోజు తర్వాత సెంగోట్టయన్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.
Also Read:
Watch: క్రేన్ ఆపరేటర్ చెంపపై కొట్టిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్
Woman Kills Son With Lover | బీమా డబ్బు కోసం.. ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన మహిళ
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి.. ఆరు నెలల చిన్నారి మృతి
 
                            