అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మృతుల వస్తువులను (Victims’ Belongings ) సేకరించేందుకు కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన బిల్డర్ రాజు పటేల్ తన స్నేహితులతో కలిసి ఈ పని చేపట్టారు. విమాన ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితుల బ్యాగులు, వస్తువులను సేకరిస్తున్నారు.
కాగా, జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాజు పటేల్ తన స్నేహితులతో కలిసి అంబులెన్స్‌లో మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. ఆ తర్వాత బాధితుల వస్తువుల సేకరణపై వారు దృష్టిసారించారు. ఇప్పటి వరకు సుమారు 800 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌లు, దుస్తులు, డబ్బు, విగ్రహాలు, భగవద్గీత వంటివి శిథిలాల నుంచి వెలికితీశారు. స్థానికులు, రెస్క్యూ సిబ్బంది నుంచి బ్యాగులు అడిగి వాటిల్లో ఉంచి అధికారులకు అప్పగించారు. బాధిత కుటుంబాలు వాటిని పొందేందుకు సహకరిస్తున్నారు.
Also Read:
Vishwas Kumar Ramesh | విమాన ప్రమాదం నుంచి బతికిన రమేష్ డిశ్చార్జ్.. సోదరుడి అంత్యక్రియలకు హాజరు