తిరువనంతపురం: మహిళ, ఆమె ప్రియుడ్ని గ్రామస్తులు నిర్బంధించారు. ఆ వ్యక్తిని కొట్టారు. వారిద్దరి మధ్య సంబంధంపై బహిరంగంగా ప్రశ్నించి విచారణ జరిపారు. (Mob Trial) ఈ అవమానం భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 17న పినరయి గ్రామానికి చెందిన 40 ఏళ్ల రసీనా, ఆమె ప్రియుడ్ని ఒక మసీదు వద్ద కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య సంబంధంపై ప్రశ్నించి బహిరంగంగా విచారణ జరిపారు. ఆ వ్యక్తిని పలు గంటల పాటు నిర్బంధించి కొట్టారు. అతడి మొబైల్ ఫోన్, ట్యాబ్ను లాక్కున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యాలయానికి రప్పించారు. అర్థరాత్రి తర్వాత అతడ్ని విడుదల చేశారు.
కాగా, ఈ సంఘటన పట్ల రసీనా కలత చెందింది. బహిరంగ విచారణపై అవమానాన్ని తట్టుకోలేకపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ద్వారా జరిగిన విషయం తెలుసుకున్నారు. ఎస్డీపీఐ కార్యకర్తలైన ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వీసీ ముబ్షీర్, 34 ఏళ్ల కేఏ ఫైసల్, 24 ఏళ్ల వీకే రఫ్నాస్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న వీడియో వైరల్
Operation Sindhu | ఇజ్రాయెల్ నుంచి భారత పౌరుల తరలింపు కోసం.. ఆపరేషన్ సింధు
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం