Usman Tariq: అలా బౌలింగ్ చేస్తే పక్కకు జరగండి.. ఇండియన్ బ్యాటర్లకు అశ్విన్ సలహా
Usman Tariq: బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారీఖ్ ఆగితే, అప్పుడు మీరు క్రీజ్ నుంచి పక్కకు జరగండి అని భారత బ్యాటర్లకు మాజీ స్పిన్నర్ అశ్విన్ సలమా ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. తారీఖ్ బౌలింగ్ యాక్షన్ వివాదం నేపథ్యంలో అశ్విన్ ఆ కామెంట్ చేశారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్(Usman Tariq) బౌలింగ్ యాక్షన్ వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ చేస్తున్న సమయంలో క్రీజ్ వద్దకు వచ్చిన తర్వాత అతను కాసేపు తన చేయిని ఆపి మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఆ బౌలర్‌ను ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నారు. ఇక బౌలింగ్ సమయంలో అతని కుడి చేయి 15 డిగ్రీల కన్నా ఎక్కువగా వంగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. తారీఖ్ బౌలింగ్ గురించి గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ కెమరూన్ గ్రీన్, దక్షిణాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ మన బ్యాటర్లకు ఓ సలహా ఇచ్చారు. ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో .. ఒకవేళ అతను తన చేయిని మధ్యలో ఆపినప్పుడు మీరు పక్కకు జరగాలని ఇండియన్ బ్యాటర్లకు సలహా ఇచ్చాడు అశ్విన్. ఆగి బౌలింగ్ చేస్తున్న యాక్షన్‌తో 30 ఏళ్ల తారీఖ్‌కు ఇప్పటికే టీ20ల్లో మంచి రికార్డు ఉన్నది. టీ20ల్లో అతను 11 వికెట్లు తీసుకున్నాడు. ఆరు కన్నా తక్కువ సగటును పరుగులు ఇచ్చాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అతని బౌలింగ్ కీలకంగా మారే అవకాశం ఉన్నది.
బంతి వేయడానికి ముందు తారీఖ్ ఆగిపోతే.. పక్కకు జరిగే హక్కు బ్యాటర్‌కు ఉంటుందని, అతను ఆగిపోతున్నాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయవచ్చు అని, ఇలాంటి సందర్భాల్లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌కు ఆ సమస్య తలనొప్పిగా మారుతుందని మాజీ బౌలర్ అశ్విన్ పేర్కొన్నాడు. యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే, అలాగే చేసేవాడినని, మ్యాచ్‌ను గెలిచేందుకు రూల్స్ ప్రకారం అన్నీ చేయాల్సి ఉంటుందని, బౌలర్ ఎప్పుడు బంతిని రిలీజ్ చేస్తాడో తనకు తెలియదని చెప్పవచ్చు అని, అప్పుడు పక్కకు జరగవచ్చు అని, ఒకవేళ బ్యాటర్ ఓ వైపు జరిగితే, అప్పుడు అది అంపైర్ బాధ్యత అవుతుందని అశ్విన్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

