Rajkot airport | నిన్న ఢిల్లీ.. ఇవాళ రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్.. కూలిన టెర్మినల్ పైకప్పు
Rajkot airport | భారీ వర్షాలకు (heavy rainfall) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే గుజరాత్ (Gujarat)లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.
Rajkot airport | భారీ వర్షాలకు (heavy rainfall) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది మరవకముందే గుజరాత్ (Gujarat)లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో (Rajkot airport)ని ఓ టెర్మినల్ పైకప్పు (terminal collapses) శనివారం ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెర్మినల్ పైఉన్న పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాగా, గుజరాత్‌లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.
VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains.
(Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S
— Press Trust of India (@PTI_News) June 29, 2024
ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్-1లో కుప్పకూలిన పైకప్పు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారు జామున 5 – 5.30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కింద ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్(45) అనే క్యాబ్ డ్రైవర్ మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని దవాఖానలకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ, సీఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని రక్షించాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలిని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Also Read..
Anant Weds Radhika | అనంత్ – రాధికల పెళ్లి వేళ.. సామూహిక వివాహాలకు ప్లాన్ చేసిన అంబానీ ఫ్యామిలీ
T-72 Tank Accident: లేహ్‌లో కొట్టుకుపోయిన టీ-72 యుద్ధ ట్యాంక్.. అయిదుగురు సైనికులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

