T-72 Tank Accident: లేహ్‌లో కొట్టుకుపోయిన టీ-72 యుద్ధ ట్యాంక్.. అయిదుగురు సైనికులు మృతి
T-72 Tank: లేహ్‌లో ఉన్న బోధి నదిలో టీ-72 యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయింది. శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ఆ ట్యాంక్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురు సైనికులు మరణించారు.
లడాఖ్: చైనా సరిహద్దు ఉన్న నదిలో విషాదం చోటుచేసుకున్నది. యుద్ధ ట్యాంక్(T-72 tank) ఆ నదిలో కొట్టుకుపోయింది. దాంట్లో అయిదుగురు సైనికులు ఉన్నారు. వారిలో ఓ జేసీవో ఆఫీసర్ ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద లేహ్‌లో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ఏరియా వద్ద ఈ ఘటన జరిగింది. రెస్క్యూ అధికారులు ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో నలుగురు గల్లంతయ్యారు.
ప్రమాదంలో మరణించిన వారిలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ ఉన్నారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. శిక్షణలో ఉన్న సైనికులు.. మందిర్ మోర్చ్ వద్ద ఉన్న బోధి నదిలో యుద్ధ ట్యాంక్‌తో క్రాస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ ట్యాంక్ కొట్టుకుపోయింది.
లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఆ ట్యాంక్ ఉన్నది. టీ-72 యుద్ధ ట్యాంక్ ప్రమాదంలో కొట్టుకుపోయింది. ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఉప్పొంగుతున్న నదిలో యుద్ధ ట్యాంక్‌తో పాటు సైనికులు నీట మునిగి మరణించారు.
భారతీయ ఆర్మీ సైనికుల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. దురదృష్టకర సంఘటన జరిగినట్లు తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. దేశం కోసం విరోచిత సేవలు అందించిన ఆ సైనికులను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో దేశం ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.
Deeply saddened at the loss of lives of five of our brave Indian Army soldiers in an unfortunate accident while getting the tank across a river in Ladakh.
We will never forget exemplary service of our gallant soldiers to the nation. My heartfelt condolences to the bereaved…
— Rajnath Singh (@rajnathsingh) June 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

