Dubai Hotel | దుబాయ్ లగ్జరీ హోటల్ బాల్కనీలో బట్టలు ఆరబెట్టిన భారతీయ మహిళ.. నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
Dubai Hotel | అత్యంత విలాసవంతమైన దుబాయ్ హోటల్ (Dubai Hotel) బాల్కనీలో ఓ భారతీయ మహిళ బట్టలు ఆరబెట్టిన (Indian Woman Drying Clothes) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Dubai Hotel | అత్యంత విలాసవంతమైన దుబాయ్ హోటల్ (Dubai Hotel) బాల్కనీలో ఓ భారతీయ మహిళ బట్టలు ఆరబెట్టిన (Indian Woman Drying Clothes) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై సదరు హోటల్ యాజమాన్యం కూడా స్పందించడం విశేషం.
పల్లవి వెంకటేష్ అనే నెటిజన్ ఇటీవలే తన తల్లితో కలిసి దుబాయ్‌కి వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ అట్లాంటిస్ ప్రాంతంలోని ది పామ్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేశారు. ఈ సందర్భంగా పల్లవి తల్లి తన బట్టలను ఎండకు ఆరబెట్టుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో హోటల్ గది బాల్కనీ (Balcony)లోకి వెళ్లి బట్టలు ఆరబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోని పల్లవి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
వీడియో పోస్టు చేసిన కొద్ది రోజుల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోపై హోటల్ యాజమాన్యం కూడా స్పందించింది. ‘మామ్ డ్యూటీస్..’ అంటూ కామెంట్ చేసింది. ‘మీరు మీ బసను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. ప్రతి బాత్రూమ్లోనూ బట్టలు ఆరబెట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాము. మీరు అక్కడ కూడా ఆరబెట్టుకోవచ్చు’ అంటూ వీడియోకి కామెంట్ పెట్టింది. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి ప్రవర్తన మంచిదికాదు. అక్కడి నిబంధనలను గౌరవించండి’, ‘దుబాయ్‌లో ఇలా చేయడం చట్టవిరుద్ధం.. జరిమానా విధించొచ్చు’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Bihar | బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. తొమ్మిది రోజుల్లో ఐదో ఘటన.. నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు
Anant Weds Radhika | అనంత్ – రాధికల పెళ్లి వేళ.. సామూహిక వివాహాలకు ప్లాన్ చేసిన అంబానీ ఫ్యామిలీ
Delhi Rain | నేడు, రేపు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం : ఐఎండీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

