Delhi Rain | నేడు, రేపు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం : ఐఎండీ
Delhi Rain | నిన్న కురిసిన భారీ వర్షానికే తేరుకోని ఢిల్లీ వాసులకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) పిడుగులాంటి వార్త చెప్పింది.
Delhi Rain | నిన్న కురిసిన భారీ వర్షానికే తేరుకోని ఢిల్లీ వాసులకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ వారాంతంలో దేశ రాజధాని అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Delhi Rain) ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘జూన్ 29, 30 తేదీల్లో ఢిల్లీ అంతటా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rain) కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
చిగురుటాకులా వణికిపోయిన ఢిల్లీ
గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఢిల్లీలో జూన్ నెల మొత్తం కలిపి సగటున 74.1 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటలల్లోనే పడింది. 1936 తర్వాత జూన్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఇప్పుడేనని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎంపీల ఇండ్లలోకి చేరిన నీరు
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఎంపీలు, మంత్రుల ఇండ్లలోకి కూడా నీరు చేరింది. లోధి ఎస్టేట్ ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్ ఇంటి ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ఆయనను భుజాలపై ఎత్తుకొని కారు ఎక్కించారు. కాగా, తాను నిద్ర లేచే సరికి తన ఇంట్లోకి అడుగు ఎత్తులో నీరు చేరిందని, ఫర్నీచర్, వస్తువులన్నీ తడిచిపోయాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇటీవల నీటి కొరతతో నిరాహార దీక్షకు దిగిన ఢిల్లీ మంత్రి అతిశీ ఇల్లు కూడా నీట మునిగింది. అసాధారణ రీతిలో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో మొత్తం వర్షాకాలం కలిపి 800 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా, 24 గంటల్లోనే ఇందులో 25 శాతం(228 ఎంఎం) వర్షం కురవడం వల్ల సమస్యలు తలెత్తాయని మంత్రి అతిశీ పేర్కొన్నారు.
ఢిల్లీకి చేరుకున్న నైరుతీ
నైరుతీ రుతపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్రమైన ఎండ, వడగాలులకు బ్రేక్ చెబుతూ.. వర్షాకాలం వచ్చినట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు శుక్రవారం ప్రకటించింది. యావత్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుపవనాలు చేరుకున్నట్లు తెలిపింది. జైసల్మేర్, చురు, భివాని, ఢిల్లీ, అలీఘడ్, కాన్పూర్, ఘాజిపూర్, గోండా, ఖేరి, మొరాదాబాద్, డెహ్రాడూన్, ఉనా, పఠాన్కోట్, జమ్మూ ప్రాంతాలకు నైరుతి చేరుకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఇక గత ఏడాది జూన్ 26వ తేదీన ఢిల్లీలోకి వర్షాకాలం ఎంటరైంది. 2021లో జూన్ 30వ తేదీన, 2020లో జూన్ 25వ తేదీన మాన్సూన్ ఎంట్రీ ఇచ్చింది.
Also Read..
Virudhunagar | బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు.. ఏడుగురు మృతి
D.Srinivas | ప్రభుత్వ అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

