MLC Kavitha | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అదానీ కుంభకోణం కారణంగా ఎల్ఐసీలోని ప్రజల డబ్బులు ఆవిరైపోతుంటే కేంద్రం ఎందుకు మౌనం గా ఉంటున్నదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదా నీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 11% మేర పడిపోవడం పట్ల ఆమె శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏమిటని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కా రు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇంత భారీ కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కో ట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి సంస్థ లు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థలంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా? అని విమర్శించారు. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాం డ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేం ద్రం కండ్లు తెరిచి దేశ ప్రజలకు మరింత నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుని, జేపీసీ వే యాలని డిమాండ్ చేశారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పద్ధతిని పాటిస్తే.. నేడు కేంద్రం లోని బీజేపీ రైడ్ అండ్ రూల్ పద్ధతిలో దేశాన్ని పాలిస్తున్నదని నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ మీద దాడులు చేయడం, పార్టీని విడగొట్టి దొడ్డిదారిలో పాలించడమే ప్రస్తుత విధానమని విమర్శించారు.
రెండు సార్లు అధికారమిచ్చినా ప్రజలకు బీజేపీ చే సిందేమీ లేదని, వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందని ఎమ్మె ల్సీ ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి అన్నిం టా విఫలమైన బీజేపీ ఈసారి ఓడిపోవాల్సిందేనని అన్నారు. ముంబైలో ఓ ప్రముఖ ఛానల్ ‘ఐడియోస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023’ పేరిట శనివారం నిర్వహించిన సదస్సుకు కవిత ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ‘2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం’ అనే అంశంపై సాగిన చర్చలో పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ చేయలేకపోయిన పనులను బీజేపీ చేస్తుంద ని నమ్మి ప్రజలు అధికారాన్ని ఇచ్చారని, ఆ నమ్మకా న్ని బీజేపీ కోల్పోయిందని, అన్నింటా విఫలమైందని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల సమయంలో బీజే పీ అనేక హామీలు ఇవ్వడంతోనే.. 282 సీట్లతో బీజే పీకి ప్రజలు అధికా రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. అయినా నల్లధనాన్ని వెనకి తేవడం, యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం, అభివృద్ధి విధానాలు, రూపా యి విలువ పడిపోకుండా ఆపడం వంటి తదితర హామీల్లో ఒక దానినీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 303 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ మూడు నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమవడం తప్ప చేసేందేమీ లేదని మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామి అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి శనివారం నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకూ కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. దేశంలో 24 గంటల విద్యుత్తు, తాగు, సాగు నీరు వంటి కనీస సదుపాయాలు తెలంగాణలో తప్ప మరే ప్రాంతంలో అమలు కావట్లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరిగా ఎందుకు చేయటం లేదు? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో నల్లాల ద్వారా 24 గంటలపాటు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంటే.. ముంబై మహానగరంలో రోజుకు 2 గంటలు మాత్రమే సరఫరా అవుతుండటంపై ఆవేదన వ్యక్తంచేశారు. శరద్‌పవార్‌తో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శరద్‌పవార్ తోడ్పాటునందించారని గుర్తుచేశారు.